అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులపై జరిగిన లాఠీఛార్జిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారని KTR ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ తెలంగాణ ఉద్యమం నాటి అణచివేత చర్యలు ప్రారంభమయ్యాయని, గ్రూప్ -1 అభ్యర్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.