UPలోని మేరఠ్‌లో ప్రియుడు సాహిల్‌శుక్లాతో కలిసి మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య ముస్కాన్ రస్తోగి హత్య చేసిన కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులు మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమెంటు డ్రమ్ములో పడేసినట్లు తెలుస్తోంది. 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అని నేవీ అధికారి కుమార్తె పొరుగింటి వారికి తెలిపింది. తమ మనవరాలి వల్లనే ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని సౌరభ్ తల్లి రేణు దేవి పోలీసులకు తెలిపింది.