హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో భారతీయ విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాపై వాషింగ్టన్ డీసీలోని JUలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్నారు. యూనివర్సిటీలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని DHSలోని అధికారులు ఆరోపించారు. దీంతో సూరి వీసాను రద్దు చేశారు. తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని సూరి కోర్టులో పేర్కొన్నారు.