BSNL తన యూజర్లను పెంచుకోవడానికి అదిరిపోయే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం డేటా వినియోగం పెరిగిపోవడంతో సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,799 ధరతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతి నెల 5000 GB డేటాను పొందవచ్చు. ఈ డేటాను 300 Mbps వేగంతో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో డేటా ముగిసిన తర్వాత కూడా, వినియోగదారులకు 30 Mbps వేగంతో అదనపు డేటా అందించబడుతుంది.