బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి: నారా లోకేశ్‌

85చూసినవారు
బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి: నారా లోకేశ్‌
విజయవాడను బుడమేరు వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్‌ మూడో గండి పూడ్చివేత పనులను ఇవాళ పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయ్యాయన్నారు. త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి వరదను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్