వృద్ధురాలిపై దాడిచేసిన ఎద్దు (వీడియో)

77చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఎద్దు వచ్చింది. దాన్ని తరిమేందుకు వృద్ధురాలు కర్రతో బెదిరించింది. ఈ క్రమంలో ఆ ఎద్దు ఒక్కసారిగా వృద్ధురాలిపై దాడికి దిగి, కొమ్ములతో పైకి ఎత్తి పడేసింది. దీంతో వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి.. ఆమెను పైకి లేపి పక్కకు తీసుకెళ్తారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అవ్వగా.. సోషల్ మీడియాలో వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్