ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు నిలయమైన దుబాయ్.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ అజీజీ నిర్మాణానికి వేదిక కాబోతోంది. ఈ భవనం 725 మీటర్లు పొడవు ఉండనుందని దీనిని నిర్మించనున్న రియల్ ఎస్టేట్ సంస్థ అజీజీ డెవలప్మెంట్స్ తెలిపింది. ఈ లెక్కన బుర్జ్ ఖలీఫా కంటే ఈ భవనం కేవలం 340 అడుగులు మాత్రమే చిన్నదిగా ఉండనుంది. బుర్జ్ అజీజీ నిర్మాణానికి సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు కానుంది.