పెట్రోల్ బంక్ వద్ద కాలిపోయిన బైక్ (వీడియో)

77చూసినవారు
యూపీలోని హర్దోయి జిల్లా శాండిలా పట్టణంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. లక్నో రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్దకు ఓ బైకర్ వచ్చాడు. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో బైక్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్