యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సదర్ కొత్వాలి ప్రాంతంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్ళింది. ఇంతలో పెట్రోల్ బంకులో ఓ పక్కన బైకులపై కూర్చొని కొందరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా బస్సు వాళ్ళ వైపు రావడం చూసి అప్రమత్తమై పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.