తమిళనాడులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని కట్టుకులం ప్రాంతంలో కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై కిల్పెన్నత్తూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తిరువన్నమలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.