త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉపఎన్నిక వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. రేవంత్ వచ్చాక కరెంట్ ఉంటే వార్త అని విమర్శించారు. రుణమాఫీ సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు.. కానీ, రుణమాఫీ కాలేదని తెలుసుకొని ఆయన రాలేదని ఎద్దేవా చేశారు.