కేరళలో సీఏఏను అమలు చేయం: సీఎం

2247చూసినవారు
కేరళలో సీఏఏను అమలు చేయం: సీఎం
సీఏఏను దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని కేరళ సీఎం పినరయి విజయన్‌ అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రం కేరళలో దీన్ని అమలుచేయబోమని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ఇప్పటికే తమ ప్రభుత్వం పదేపదే చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్‌ కేరళ ఏకతాటిపై నిలబడాలని కోరారు.

సంబంధిత పోస్ట్