వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. శుక్రవారమే క్యాబినెట్ సవరణల్ని ఆమోదించింది. త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వక్ఫ్ చట్టం(1954)లో 40కి పైగా సవరణల్ని కేంద్రం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో సాయుధ బలగాలు, రైల్వే తర్వాత మూడో అతి పెద్ద భూ యజమాని(9.4 లక్షల ఎకరాలు) వక్ఫ్ బోర్డే.