KGBVల్లో డైట్ ఛార్జీల పెంపు

70చూసినవారు
KGBVల్లో డైట్ ఛార్జీల పెంపు
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న KGBVల్లో డైట్ ఛార్జీలు పెరిగాయి. ఈ మేరకు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థినికి రూ.1400 ఇస్తుండగా, రూ.1600కు పెంచినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ ఛార్జీలతో విద్యార్థినులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో 1.1 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్