గంజాయి బ్యాచ్ బీభత్సం.. కానిస్టేబుళ్లను కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు (వీడియో)

55చూసినవారు
AP: కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి జగ్గంపేట పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును వారు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో గంజాయి బ్యాచ్ పోలీసులను కారుతో ఢీకొట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్