1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసీ 814ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో కెప్టెన్ దేవి శరణ్ పైలట్‌గా ఉన్నారు. ఈ ఫ్లైట్ ఖాట్మండు-దిల్లీ వెళ్తుండగా పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు సభ్యులు హైజాక్ చేశారు. హైజాక్ సమయంలో కెప్టెన్ శరణ్ వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసించారు. ల్యాండింగ్ కు ఒప్పుకోకుంటే క్రాష్-ల్యాండ్ చేస్తానని అతడు అధికారులను హెచ్చరించి విమానాన్ని లాహోర్ లో దింపేందుకు అనుమతి పొందాడు.