TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో కారు బీభత్సం సృష్టించింది. హీరో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్ పాత్ పైకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసం అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లియర్ చేశారు.