పొరుగు దేశం నేపాల్‌లో కురుస్తున్న వర్షాల ప్రభావం బీహార్‌పై పడింది. ముఖ్యంగా ఇండో – నేపాల్ సరిహద్దు సమీపంలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కోసి, గండక్, బాగ్మతి సహా ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం బీహార్ లో ఆరు బ్యారేజీలు బద్దలయ్యాయి. ఈ క్రమంలోనే ముజఫర్‌పూర్‌లోని పవర్ గ్రిడ్ కంట్రోల్ రూమ్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చని అధికారులు ముందస్తుగా హెచ్చరించారు.