యువతిని ఢీకొట్టిన కారు (వీడియో)

51చూసినవారు
కొందరు నిర్లక్ష్యంగా వాహనాలను డ్రైవింగ్ చేస్తూ ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇదే కోవలో యూపీలోని ఘజియాబాద్ ఇందిరాపురంలో శుక్రవారం ఓ కారు డ్రైవర్ వేగంగా వాహనాన్ని పోనిచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు ఆ యువతి గాల్లోకి ఎగిరి కింద పడింది. బాధితురాలిని పట్టించుకోకుండా కారు డ్రైవర్ పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్