తెలంగాణ పోలీసులా మజాకా..!

70చూసినవారు
రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా వాహనాలు నడిపే వారికి తెలంగాణ పోలీసులు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి పోలీసులు ఏర్పాటు చేసిన కటౌట్ చూసి నిజమైన పోలీసులనుకుని హెల్మెట్ పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్లే జాతీయ రహదారిపై ఇది ఏర్పాటు చేయడంతో ఐడియా అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్