అదుపుతప్పిన కారు.. రోడ్డుపై బీభత్సం (వీడియో)

1098చూసినవారు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరం సహకర్ మెయిన్ రోడ్డులో శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. ఓ బాలెనో కారు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపుతప్పింది. వాహనాలతో పాటు రోడ్డు పక్కన ఉన్న వారిని ఆ కారు ఢీకొట్టింది. స్థానికులు తేరుకునే లోపే ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్