కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి BRSను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్‌ను ఛాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాలు లీకులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్ రావు మాట్లాడారు.