AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలు సహా పలు చోట్ల గురువారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. దాంతో శుక్రవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వర్షంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని, సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.