బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. HYD మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పులువురు టాలీవుడ్ సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, అనన్య నాగళ్ల, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులపై కేసు నమోదైంది. మొత్తం 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.