కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ సీన్‌ని మార్చారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. తొలుత ఇది ఆత్మహత్య అని తల్లిదండ్రులకు పశ్చిమబెంగాల్ పోలీసులు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఈ కేసుకు సంబంధించిన తన స్టేటస్ రిపోర్టును సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది.