నటుడు ప్రేమ్‌జీ పెళ్ళిలో సెలబ్రిటీల సందడి

75చూసినవారు
నటుడు ప్రేమ్‌జీ అమరన్‌ ఓ ఇంటివాడయ్యారు. తన స్నేహితురాలైన ఇందును వివాహం చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఈ వేడుకకు దర్శకుడు వెంకట్‌ ప్రభు, నటులు జై, వైభవ్‌ తదితరులు హాజరై ప్రేమ్‌జీని ఆటపట్టిస్తూ సందడి చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్‌ కుమారుడే ప్రేమ్‌జీ. ఈయన పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.