బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీకి క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. సెన్సార్ బోర్డు మాత్రం సర్టిఫికేట్ ఇవ్వడం లేదని రనౌత్ ఆరోపించారు. దీని కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆలస్యం చేస్తే తన సినిమాను కాపాడుకునేందుకు కోర్టుకు కూడా వెళ్తానని అన్నారు. అయితే సినిమా అనుకున్న సమయానికే వస్తుందని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు.