పట్టపగలు మాల్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు (షాకింగ్ వీడియో)

55చూసినవారు
పూణే లోని మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. వాకాడ్‌లోని ఫోనిక్స్ మాల్‌ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ముందుగా నిందితుడు ఓ వైట్ కారులో నుంచి బయటకు వచ్చి మాల్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనతో మాల్‌లోని జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్