గుజరాత్‌లోని సబర్‌కాంతా జిల్లాలో చాందిపురా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 12కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించారు. ఈ అనుమానిత చాందిపురా వైరస్‌పై పూర్తిస్థాయి ధ్రువీకరణ కోసం నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఫలితాల అనంతరం ఆ మరణాలు చాందిపురా వైరస్ వల్ల సంభవించాయో లేదో స్పష్టంగా తేలనుంది.