జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించారు. ఇటూకాకి పర్వతారోహకురాలిగా మంచి గుర్తింపు ఉంది. ఆమె 70వ ఏటా జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తైన ఒంటాకే పర్వతాన్ని రెండు సార్లు అధిరోహించారు. కాగా, ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా(117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది.