ఆసియా అత్యంత సంపన్నమైన గ్రామం ఇండియాలోని గుజరాత్‌లో ఉంది. ఈ గ్రామం పేరు మాదాపార్. ఈ గ్రామ ప్రజల ఫిక్సుడ్ డిపాజిట్లు ఏకంగా రూ.7 వేల కోట్లు ఉన్నాయి. మాదాపార్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్లతో పాటు 17 బ్యాంకులు ఉన్నాయి. ఇక ఈ గ్రామంలో దాదాపు 20 వేల కుటుంబాలు ఉండగా.. 1,200 కుటుంబాలు విదేశాల్లో నివసిస్తున్నాయి. తమ సంపాదనను విదేశాల్లో కాకుండా.. తమ గ్రామంలోని బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నారు.