భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మోదీకి ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఘన స్వాగతం పలికారు. అనంతరం రష్యా చేస్తున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ భావోద్వేగానికి లోనవ్వగా, మోదీ ఆయనను భుజం తట్టి ఓదార్చారు.