ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ లో తన 22 ఏళ్ల మేనకోడలిని చంపిన ఘటనలో మణికాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో వివాహేతర సంబంధంలో ఉండి, వేరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడమే ఆమె హత్యకు కారణమన్నారు. నిందితుడు ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పడేసి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సెల్ఫోన్ని బస్సులో విసిరేశాడు. కాగా, మణికాంత్ పై అనుమానంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.