రాజకీయ నాయకుల్లో ఐటీ జ్ఞానిగా, ఈ-గవర్నెన్స్‌ను పరిచయం చేసిన దార్శనికుడిగా చంద్రబాబుకు పేరుంది. 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబరు 24ను ‘నాయుడు డే’గా ప్రకటించారు. ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ ప్రధాని గో చోక్‌టోంగ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తదితర ప్రముఖులు ఏపీని సందర్శించారు.