ప్యాక్ చేసిన నీళ్లే.. ఇప్పుడు మన ప్రాణాలు తీసే ప్రమాదం ఉందంటున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్‌లో ఉండే నీటిలో మైక్రో ప్లాస్టిక్‌లు, బీపీఏ తదితర హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఇది థైరాయిడ్ హార్మోన్లు, రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అలాగే గుండె, మధుమేహం, ఊబకాయం సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.