టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న ఆయన తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అధ్యక్షుడి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు.