TG: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 రిలీజ్ రోజు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఒక మహిళ మృతిచెందగా.. మరో బాలుడికి తీవ్రగాయాలు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి సీతక్క పరామర్శించారు. ఆ బాలుడికి చికిత్స అందిస్తున్న డాక్టర్‌లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ తండ్రిని కలిసి ధైర్యం చెప్పారు.