TG: త్వరలోనే వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా రీజనల్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 19న సీఎం రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్‌పై అధికారిక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వరంగల్ నగరం చుట్టూ ఉన్న మండలాలు, గ్రామాలకు మహర్దశ పట్టనుంది. వరంగల్ నగరంతో పాటుగా చుట్టూ ఉన్న 19 మండలాలు, 181 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.