ఈ ఇంటి చిట్కాలతో మలబద్దకానికి చెక్

2774చూసినవారు
ఈ ఇంటి చిట్కాలతో మలబద్దకానికి చెక్
ఉసిరికాయలో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 30 మి.లీ ఉసిరి రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి ఉదయం పూట తాగడం వల్ల జీర్ణశక్తి పెరిగి మలబద్ధకం తగ్గుతుంది. రాత్రి నిద్రపోయే ముందు వేడి పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే మలబద్దకం సమస్య పోతుంది. ఈ సమస్య పోవాలంటే నీళ్లను కూడా ఎక్కువగా తాగాలి. బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు పీచుతో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఫోలేట్, విటమిన్ సి, కె ఉంటాయి. ఇవి కూడా మలబద్దకం సమస్యను పోగొడతాయి.

సంబంధిత పోస్ట్