కొన్నిసార్లు మనం బిజీగా ఉన్నప్పుడు కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్ చిరాకు తెప్పిస్తాయి. అయితే ఈ స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు భారతదేశ టెలికాం వాచ్‌డాగ్ చర్యలు తీసుకుంది. రిజిస్టర్ కానీ సంస్థల నుంచి వచ్చే కాల్స్ ను టెలికాం సంస్థలు నిలిపేవేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్, ప్రీ రికార్డెడ్, కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్.. ఇలా అన్ని రకాల కాల్స్ ను ఆపివేయాలని సూచించింది. పెరుగుతున్న స్పామ్, ఫిషింగ్ కాల్స్ ను నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.