AP: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి మరికొంత కాలం ఆగాల్సిందేనని ప్రచారం సాగుతోంది. ఆయనను మొదట ఎమ్మెల్సీ చేసిన తర్వాతే మంత్రిగా చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కూటమిలోని ఎమ్మెల్యేలలో చాలా మంది మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కాకుండానే నాగబాబుకు మంత్రిని చేస్తే వారికి కోపం రావచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.