బీజేపీ అగ్ర నేత ఎల్‌కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 12న ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అద్వానీ చేరారు. అనారోగ్యం కారణంగా ఐసీయూలో ఉంచినట్లు డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. వినిత్ సూరి సంరక్షణలో అద్వానీ కోలుకున్నారు.