ఢిల్లీ రావు కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఇన్‌స్టిట్యూట్‌లోనే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మూసివేశారని తేలింది. ఇన్‌స్టిట్యూట్‌లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు లేవని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. కోచింగ్ ఇన్స్టిట్యూట్ డ్రైనేజీ కాలువను పై నుండి కప్పింది. పార్కింగ్ స్థలం నేరుగా రహదారికి ఆనుకొని ఉంటుంది. దీంతో వర్షం నీరు పార్కింగ్ స్థలంలోకి వెళ్తున్నాయని తెలిపింది.