ప్రస్తుత కాలంలో పిల్లలంతా చాలా స్పీడ్ గా ఉంటున్నారు. చదువుల్లోనూ, ఆట పాటల్లోనూ చాలా ఫాస్టుగా ఉంటున్నారు. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీల కారణంగా ఒక్కరు తప్పితే ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్లకు ఆటా పాట అన్నీ తల్లిదండ్రులతోనే అవుతోంది. దీంతో గారాబం ఎక్కువ జరుగుతుంది. ఫలితంగా మొండిపట్టు, మంకుపట్టు తప్పనిసరి అవుతోంది. ఇటువంటి పిల్లలతో వ్యవహరించటం తలకు మించిన భారం అవుతోంది. ఇటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని సదరన్ ఇల్లియోనిస్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యాపకులు సూచిస్తున్నారు.