అరుణాచల్‌లో 30 ప్రాంతాలకు చైనా సొంత పేర్లు!

82చూసినవారు
అరుణాచల్‌లో 30 ప్రాంతాలకు చైనా సొంత పేర్లు!
అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అక్కడి 30 ప్రాంతాలకు తమ భాషలో కొత్త పేర్లను పెట్టింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక సరస్సు, పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయి. వచ్చే నెల 1 నుంచి ఈ పేర్లు అమల్లోకి రానున్నట్లు ఆ దేశ అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. కాగా అరుణాచల్ తమదేనంటూ చైనా చాలాకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్