చైనా ప్రజలు ఏటా 10,000 టన్నులకు పైగా పాముల మాసాన్ని తింటున్నారని చైనా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అసోసియేషన్ తెలిపింది. పాము మాంసం మానవ శరీరాన్ని బలోపేతం చేస్తుందనేది దక్షిణ చైనీయుల నమ్మకం. దీంతో షాంఘై & గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. గ్వాంగ్ డాంగ్ లోని రెస్టారెంట్లలో రోజుకు 20 టన్నుల పాము మాంసాన్ని విక్రయిస్తుండగా, షాంఘైలో ఏటా 4 వేల టన్నుల పాము మాంసాన్ని వినియోగిస్తున్నారు.