రాజస్థాన్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్‌గఢ్ సమీపంలో బహ్లోల్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అజయ్ భాదు అనే ఉపాధ్యాయుడు శనివారం 10వ తరగతికి చెందిన దళిత విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవడంతో.. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.