AP: చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందిన బాలిక (16) పదో తరగతి చదువుతోంది. అయితే ఆమె గర్భం దాల్చింది. అందుకు కారకుడెవరో తెలీదు. అమాయకులైన తల్లిదండ్రులు పరువు పోతుందనే భయంతో విషయం బయటకు పొక్కనీయలేదు. అయితే ఆమెకు పురిటినొప్పులు రావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ వేదనతో తల్లి మృతి చెందింది. ఆమె గర్భానికి కారకుడైన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.