మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షిన్‌బౌమ్ (62) ప్రమాణస్వీకారం చేశారు. శాస్త్రవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన క్లాడియా ముందు పెచ్చరిల్లుతున్న హింస, మందగించిన ఆర్థిక పరిస్థితి, హరికేన్ ఇక్కట్ల వంటి పలు తక్షణ సవాళ్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సైతం మెక్సికో స్థితిగతులపై ప్రభావం చూపించే అవకాశముంది. తాను గెలిస్తే మెక్సికోలో తయారైన వాహనాలపై వంద శాతం సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.