పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనం

74చూసినవారు
పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనం
పాత సోడా క్యాన్లు, సముద్ర జలాలతో స్వచ్ఛ ఇంధనాన్ని తయారుచేయవచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. అల్యూమినియం సోడా క్యాన్లు సముద్రపు నీటిలో పడినప్పుడు బుడగలు ఉత్పత్తి అవుతాయని, దీంతో సహజంగా హైడ్రోజన్‌ తయారవుతుందని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ గ్యాస్‌ను ఇంజిన్లు, ఫ్యూయెల్‌ సెల్‌లకు ఉపయోగించవచ్చని, దీని ద్వారా కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కావని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్